14-10-2025 10:19:40 PM
అనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్న నగేష్..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో మంగళవారం చంద్రబాబు నాయుడుని కలిసి పుష్పగుచ్చాన్ని అందించారు. టీడీపీ ద్వారా 31 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తనకు చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో ఎన్నో అవకాశం ఇచ్చరాని గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా, పార్టీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జిల్లా పార్టీ అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నో పదవులు ఇచ్చారని, అనాటి రోజులను నెమరేసుకున్నరు.