calender_icon.png 15 October, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి సేవాసమితి ద్వారా ఉచిత వృత్తి శిక్షణ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

14-10-2025 10:10:06 PM

ఇల్లెందు (విజయక్రాంతి): సింగరేణి సేవాసమితి ఇల్లందు ఏరియా ఆద్వర్యంలో జే.కే.ఓ.సి. విస్తరణ ప్రభావిత ప్రాంతాలు, విజయలక్ష్మినగర్, భుపేష్ నగర్, తిలక్ నగర్, పుసపల్లి, రొంపేడ్, స్ట్రట్ ఫిట్ బస్తి, గ్రామ ప్రజల ఉచిత వృత్తి శిక్షణ కోర్సులకు దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నట్లు జీఎం వీసం కృష్ణయ్య తెలిపారు. టైలరింగ్, మగ్గం, బ్యూటీషియన్ కోర్సులు ఉచిత వృత్తి శిక్షణ తరగతులను అక్టోబర్ నెలలో ప్రారంబించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ మహిళలు 16 లోపు జి.యం. కార్యాలయంలోని సేవా సమితి నందు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులకు సింగరేణి సేవాసమితి చేపడుతున్న ఉపాది అవకాశాలను అందరు సద్వినియోగం చేసుకోని తమ తమ వృత్తులలో నైపుణ్యత అందుపరుచుకొని స్వయం ఉపాది పొందాలని కోరారు.