14-10-2025 10:22:44 PM
సిర్గాపూర్ (విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని పటేల్ తండా, గైరాన్ తండాలలో పత్తి పంటలు, కంది చెన్లను కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి, సిర్గాపూర్ ఎస్సై మహేష్ స్పెషల్ పార్టీ కలిసి డ్రోన్ కెమెరా ద్వారా మంగళవారం నాడు తనికి చేయ్యడం జరిగింది. స్పెషల్ పార్టీతో ప్రతి రోజు డ్రోన్ ద్వారా కంగ్టి, సిర్గాపూర్, కల్హేర్ మండలల్లో తనకి చేయ్యడం జరుగుతుందని సీఐ వెంకట్ రెడ్డి తెలిపారు. ఎవరైనా గంజాయి సాగు చేస్తే కేసు నమోదు చేసి జైల్ కు పంపించడం జరుగుతోందని, ప్రభుత్వం నుండి వచ్చే అన్ని పథకాలు కూడా కట్ (నిలిపి వెయ్యడం) జరుగుతుందని, రైతు బంధు, కరెంట్ కనెక్షన్, ప్రభుత్వ బీమాలు అన్ని నిలిపివేయబడతాయని అన్నారు. కొత్త చట్టం ప్రకారం ఆస్తులను కూడా జప్తు చేయ్యడం జరుగుతయాని, ఎవరన్నా గంజాయి సాగు చేసిన పోలీస్ వారికి తెలియజేయాలి, వారి వివరాలు గోప్యంగా ఉంచబడతయాని సీఐ వెంకట్ రెడ్డి పేర్కొన్నారు.