calender_icon.png 26 October, 2025 | 1:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఆదివాసీ నాగులమ్మ జాతర

25-10-2025 10:17:19 PM

అశ్వాపురం (విజయక్రాంతి): అశ్వాపురం మండల పరిధిలోని గొందిగూడెం, సండ్రాలబోరు, అమెర్డ గ్రామాల్లో శనివారం నాగుల చవితి సందర్భంగా ఆదివాసీల కులదైవం నాగులమ్మ జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరై నాగులమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానికులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులను ఆశీర్వదించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వంశపారంపర్యంగా వస్తున్న ఆదివాసీ ఆచారాలు, సంప్రదాయాలను కాపాడుకోవడం మన అందరి బాధ్యత. మూలాలను మరవకుండా, సంస్కృతిని నిలబెట్టుకోవాలి” అని అన్నారు.

నాగులమ్మ జాతరను ఘనంగా నిర్వహించిన కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య, సీనియర్ నాయకులు గాదె కేశవరెడ్డి, ఓరుగంటి రమేష్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భూరెడ్డి వెంకటరెడ్డి, శర్పుద్దిన్, ఎనిక రవి, పాయం సర్వేశ్వరరావు, చుంచు ఏకాబ్రం, తెల్లం వీరభద్రం, కాక రాములు, పాయం బద్రమ్మ, కొమరం చిట్టెమ్మ, రావులపల్లి నరసింహరావు, శశికాంత్, గొల్లపల్లి నరేష్, విజయ్, షారుక్ పాషా, తదితరులు గ్రామస్తులతో కలిసి పాల్గొన్నారు.