calender_icon.png 26 October, 2025 | 1:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలి

25-10-2025 10:15:54 PM

ఏరియా జిఎం దుర్గం రామచందర్..

మణుగూరు (విజయక్రాంతి): సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏరియా జిఎం దుర్గం రామచందర్ అన్నారు. శనివారం సింగరేణి ఐటీ శాఖ ఆధ్వర్యంలో జిఎం కార్యాలయ సమావేశ మందిరంలో సైబర్ మోసాలపై ఉద్యోగులకు, అధికారులకు, అవగాహన సదస్సు నిర్వహించారు. జిఎం మాట్లాడుతూ, సైబర్‌ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని, ఫోన్‌ లో గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం కేవైసీ అప్‌డేట్‌ చేయమని వచ్చే మెసేజ్‌లకు స్పందించవద్దని సూచించారు. సైబర్‌ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930 నెంబర్‌కు డయల్‌ చేసి సమాచారం అందించాలన్నారు.

వెంటనే ఫిర్యాదు చేయడం వల్ల పోగొట్టుకున్న సొమ్ము రికవరీ చేసే అవకాశం ఉందన్నారు. సైబర్‌ నేరగాళ్లు ఉద్యోగులను ఎక్కువగా టార్గెట్‌ చేస్తున్నారని ఇంటర్నెట్‌ను పరిమితికి మించి వాడకూడదని సూచించారు. ఈ మేరకు ఆన్‌లైన్‌ మోసాలు, ఆర్థిక నేరాలు, లోన్‌ యాప్‌ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఐటి అధికారులు వివరించారు. కార్యక్రమంలో ఏరియా ఇంజి నీర్ శ్రీనివాస్, ఏఎస్ వెంకట రామారావు, ప్రాజెక్ట్ అధికారులు వీరభద్రరావు, శ్రీనివాస్, ఏజిఎం(ఐఈడి) రాంబాబు, డిజిఎం(పర్సనల్) రమేశ్, డిజిఎం(ఫైనాన్స్) శ్రీమతి అనురాధా, మధన్ నాయక్, డివై. సిఎంఓ జ్యోతిర్మై పాల్గొన్నారు.