08-07-2025 12:59:45 AM
-తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం అధ్యక్షురాలు మాలాశ్రీ
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై ౭ (విజయక్రాంతి): కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా ఈనెల 9న నిర్వహించే దేశవ్యాప్త సమ్మెకు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షురాలు కోరెంగా మాలశ్రీ తెలిపారు.
సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆదివాసీలకు అన్యాయం చేసే విధంగా కుమ్రం భీం జిల్లా ను కన్జర్వేషన్ రిజర్వుగా నిర్ణయిస్తూ తీసుకొచ్చిన జీవో నెంబర్ 49 కూడా వెనక్కి తీసు కోవాలని డిమాండ్ చేశారు.
కార్మిక వర్గానికి మద్దతుగా జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెలో ఆదివాసీలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కోట శ్రీనివాస్ పాల్గొన్నారు.