08-07-2025 01:00:29 AM
చేవెళ్ల , జులై 7 : చేవెళ్ల మున్సిపల్ పరిధి ఊరెళ్ల వార్డులో ఎమ్మార్పీఎస్ 31వ ఆవిర్భావ దినోత్సవం ఎమ్మార్పీఎస్ గ్రామ అధ్యక్షుడు గంగారం నరేష్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మార్పీఎస్ మండల కో ఆర్డినేటర్ మల్లికార్జున హాజరై నేతలతో కలిసి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ పోరాడి సాధించుకున్న రిజర్వేషన్ ఫలాలను అందరికీ అందేలా కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచ్లు జహంగీర్, ఉరడి నర్సింలు, మాజీ వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, మాజీ ఉప సర్పంచి విఠలయ్య, ఎమ్మార్పీఎస్ నాయకులు పెంటయ్య, చందు, యాదయ్య, మల్లేష్, రమేశ్, సభ్యులు మహేందర్, రాజు, రాము, ప్రవీణ్, మహేందర్, ,రాజు, అనిల్, సంజీవయ్య, జైరాజ్, అశోక్, మహ్మద్ మోయిజ్, యాదగిరి, శ్రీకాంత్, శివాజీ, కృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.