calender_icon.png 6 December, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎంపీ చిత్రపటానికి పాలాభిషేకం

06-12-2025 06:09:01 PM

మంచిర్యాల (విజయక్రాంతి): రిటైర్డ్ కార్మికులకు రూ.10 వేల కనీస పెన్షన్ ఇవ్వాలని పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన పెద్దపెల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ చిత్రపటానికి శనివారం సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. సింగరేణి సంస్థలో మూడు నుంచి నాలుగు దశాబ్దాల పాటు పనిచేసి సంస్థ అభివృద్ధి కోసం పనిచేసి ఉద్యోగ విరమణ పొందిన సింగరేణి, కోల్ ఇండియా విశ్రాంత బొగ్గు పెన్షన్ దారులకు కనీస పెన్షన్ రూ. 10 వేలు ఇవ్వాలని, దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా చూడాలని పెద్దపెల్లి పార్లమెంటు సభ్యుడు గడ్డం వంశీకృష్ణ పార్లమెంటు సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయటం హర్షనీయమని సంఘం అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య అన్నారు.

1998లో కేంద్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వెంకటస్వామి కృషి వల్లనే సింగరేణి, కోల్ ఇండియాలో మూడవ బెనిఫిట్ గా దాదాపు ఆరు లక్షల పైచిలుకు మంది బొగ్గు విశ్రాంత ఉద్యోగులు ఈ రోజున కోల్ మైన్స్ పెన్షన్ పొందుతున్నారని పేర్కొన్నారు, కానీ గత అగ్రీమెంటులో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి మార్కెట్ లో పెరుగుతున్న ధరలకు అనుకూలంగా పెన్షన్ పెంచాలని ఒప్పందం ఉన్న, కేంద్ర ప్రభుత్వం కానీ, కోల్ ఇండియా యజమాన్యం కానీ, సీఎంపీఎఫ్ ట్రస్ట్ బోర్డు కానీ ఒక పైసా కూడా పెంచిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సింగరేణిలో వేలాది మంది విశ్రాంత ఉద్యోగులకు రూ. 350, రూ. 500 నుంచి వెయ్యి రూపాయల మాత్రమే పెన్షన్ పొందుతున్నారని, దీంతో వారి కుటుంబాలు మనగడ ఎలా సాగుతుందో ఒకసారి కేంద్ర ప్రభుత్వం, కోల్ ఇండియా యజమాన్యం,  సీఎంపీఎఫ్ ట్రస్ట్ బోర్డు మానవత దృష్టితో ఆలోచించి 28 ఏండ్ల నుంచి పెంపుదలకు నోచుకోని కోల్ మైన్స్ పెన్షన్ ను పెంచే విధంగా తగిన చర్యలు వెంటనే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు రాళ్ల బండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పూదరి నర్సయ్య, నాయకులు గూడ రాజిరెడ్డి, గోపతి లక్ష్మణ్, చిప్పరామస్వామి, మామిడాల సత్యనారాయణ, కోట చంద్రమౌళి, అడిచెర్ల రాజేశం, పనాస లింగయ్య, మునిమడుగుల రాజయ్య, చొప్పదండి బాబు, బ్రహ్మయ్య చారి తదితరులు పాల్గొన్నారు.