06-12-2025 06:06:56 PM
బాన్సువాడ, (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ భారత రాజ్యంగా రూపకర్త, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని, ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఒకటే అని, కులాల అసమానతలు లేకుండా అందరికీ న్యాయం జరిగేలా రాజ్యాంగాన్ని రూపొందించారు.
ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని బిజెపి నాయకులు అన్నారు .ఈ కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షులు కోణాల గంగారెడ్డి బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి జిల్లా కార్యదర్శి శంకర్ గౌడ్ బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శి చిరంజీవి జిల్లా కౌన్సిలింగ్ నెంబర్ ప్రసాద్ బిజెపి పట్టణ ఉపాధ్యక్షులు అనిల్ రామకృష్ణ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకట్ల రాజు కొండని గంగారం నాగరాజు సాయి రెడ్డి శంకర్ తదితరు పాల్గొన్నారు.