06-12-2025 06:17:40 PM
నివాళులర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్ (విజయక్రాంతి): రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా.బి.ఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా శనివారం చైతన్యపురి కాలనీలోని తన కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు బండి సంజయ్ కుమార్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు, బిజెపి జిల్లా అధ్యక్షులు కృష్ణా రెడ్డి, బిజెపి నాయకులు పాల్గొన్నారు.