calender_icon.png 6 December, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ కు ఎర్రవందనాలు..

06-12-2025 06:04:05 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత డా. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సీపీఐ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. 69 వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాంటా చౌరస్తా వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ సమితి కార్యదర్శి ఆడెపు రాజమౌళి, రాష్ట్ర సమితి సభ్యులు బొల్లం పూర్ణిమ, జిల్లా కార్యవర్గ సభ్యులు చిప్ప నరసయ్య, పట్టణ సహకార దర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ జిల్లా సమితి సభ్యులు దాసరి శ్రీధర్ ,కొంకుల రాజేష్, రత్నం రాజం,తదితరులు పాల్గొన్నారు.