calender_icon.png 6 December, 2025 | 7:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తి కాంగ్రెస్ ఆచరిస్తుంది

06-12-2025 06:12:37 PM

నిర్మల్ (విజయక్రాంతి): ప్రపంచ దేశాల్లోని అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశల సాధనకు కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వి బొజ్జు పటేల్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కార్యకర్తలతో కలిసి రాజ్యాంగ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసి అధ్యక్షులు శ్రీహరి రావు గ్రంథాలయ చైర్మన్ అర్జు మంద్ అలీ ఆ పార్టీ నాయకులు అప్పల గణేష్ ఇస్మాయిల్ కృష్ణవేణి ఈశ్వర్ నాందేడ్ చిన్ను ఇమ్రానుల తదితరులు పాల్గొన్నారు.