calender_icon.png 6 December, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ జయంతి వేడుకలు

06-12-2025 06:15:47 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ మహాపరినిర్వాణ దినోత్సవం సందర్బంగా సందీప్ నగర్‌లో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పంచశీల జెండాను ఆవిష్కరించి, త్రిశరణ–పంచశీల బౌద్ధ వందన కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సంస్థ అధ్యక్షుడు సుధాకర్ దుర్గే మాట్లాడుతూ, అంబేద్కర్ చూపించిన మార్గం సమాజ పురోగతికి దారితీసేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి పూరుషోత్తం దుర్గే, గౌరవాధ్యక్షులు మురళీదర్ జాడే, కొండయ్య దుర్గే, కోశాధికారి లింగయ్య చంద్రి, నాయకులు ప్రవీణ్ దొంగ్రే, గోవర్ధన్ కాంబ్లే, పెంటుజీ కమిటీ సభ్యులు రావిదాస్ జాడే, అజిత్ కట్కార్, మహేష్, విష్ణు నాగరాడే, జగదీష్ చూనార్కర్, సుజిత్ చంద్రి తదితరులు  పాల్గొన్నారు.