calender_icon.png 20 August, 2025 | 6:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాడు ఆప్యాయత.. నేడు ఆమడ దూరం

13-08-2024 01:07:51 AM

ఏపీ ముఖ్యమంత్రి బాబు, మంత్రి లోకేశ్ తీరుపై అసంతృప్తి 

హైదరాబాద్, ఆగస్టు 12 (విజయక్రాంతి): ఎన్నికల ముందు ఎంతో ఆప్యా యంగా మాట్లాడిన టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేశ్.. గెలిచిన తర్వాత మోహం చాటేస్తున్నారని ఇటు పలు రంగాలవారు, అటు పార్టీ క్యాడర్ వాపోతున్నారు. ఎన్నికల్లో పార్టీ కోసం అహర్నిషలు కష్టపడి గెలుపులో కీలకంగా పనిచేసినవారికి కూడా అధినేత, యువనేత అస్సలు టైమ్ ఇస్తలేరనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు అభివృద్ధి కోసమని చంద్ర బాబు, లోకేశ్ ఒక అడుగు ముందుకేసి.. వివిధ వర్గాల ప్రజలను ప్రత్యేకంగా పిలిపించుకొని మరీ మాట్లాడారు. గెలిచిన తర్వాత పార్టీ కోసం పని చేసిన వారే 10 అడుగులు ముందుకేసి చంద్రబాబు, లోకేశ్‌ను కలిసేందుకు ప్రయత్నించినా ఇప్పుడు వారికి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రెండు నెలలైనా టైమ్ ఇస్తలేరు..

జూన్ 4న ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. టీడీపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని నమోదు చేసింది. ఎన్నికలకు ముందు టీడీపీ ఎన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నదో దేశం మొత్తం చూసింది. కష్టకాలంలో ఉన్న పార్టీకి మళ్లీ పునర్జీవం పోసేందుకు అనేక మంది తీవ్రంగా శ్రమించారు. ఇందులో టీడీపీ అభిమానులు, ఎన్నారైలు, సమాజంలో పలుకుబడి ఉన్న వాళ్లు, జర్నలిస్టులు, బ్యూరోక్రాట్లు, పారిశ్రామిక వేత్తలు ఇలా అనేక వర్గాల వాళ్లు ఉన్నారు.

ఆయా వర్గాల నుంచి పార్టీకి కోట్ల రూపాయల డొనేషన్లు కూడా వచ్చినట్టు సమాచారం. ఆర్థికంగా, రాజకీయంగా సాయపడంతో టీడీపీ అనూహ్య విజయాన్ని అందుకుంది. అయితే ఈ విజయానందాన్ని తమ అధినేత, యువనేతతో పంచుకోవాలని, వారికి శుభాకాం క్షలు చెప్పాలని టీడీపీ క్యార్యకర్తలు, ఎన్నారైలు, బ్యూరోక్రాట్లు, ఇతర వర్గాలవారు ఎంతో ఆకాంక్షించారు. కానీ వారి ఆశలు అడియాసలవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వచ్చి రెండు నెలలు దాటినా.. కలిసేం దుకు ఇద్దరు నేతలు టైమ్ ఇస్తలేరని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నారైలను కూడా పట్టించుకోవట్లేదట

టీడీపీ గెలుపులో ఎన్నారైలు చాలా కీలక పాత్ర పోషించారు. విదేశాల నుంచి వచ్చి.. సొంత డబ్బులతో ఏపీలో క్యాంపెయినింగ్ చేశారు. టీడీపీ గెలుపుకోసం భారీగా ఖర్చు చేశారు. విదేశాల్లో ఉన్న ఓటర్లను ఏపీ రప్పించి ఓటు వేయించడంలో ముఖ్య భూమిక పోషించారు. ఇంత కష్టపడిన తమకు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ మోహం చాటేస్తున్నారని కొందరు ఎన్నారైలు బాధపడుతున్నారు.