13-08-2024 12:57:37 AM
న్యూఢిల్లీ, ఆగస్టు 12: గుట్టుచప్పుడు కాకుండా అక్రమ తుపాకుల ఫ్యాక్టరీ నడుపుతున్న ఫ్యాక్టరీ నిర్వాహకులను ఓ వీడియో పట్టించింది. మధ్యప్రదేశ్‌లోని చంబల్ ప్రాం తంలోని మోరెనా జిల్లాలో ఇటీవల ఓ మహిళ తుపాకులను కడుగుతున్న వీడియో వైరల్ అయ్యింది. అందులో ఆమె నాటు తు పాకులను బ్రష్‌తో పాలిష్‌చేస్తోంది. వీడియో పోలీసుల దృష్టికి వచ్చింది.
నాటు తుపాకులు, ముడిసరుకు..
వీడియో ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. అది మధ్యప్రదేశ్‌లోని మహు వా పీఎస్ పరిధిలోని గణేష్‌పురలోని ఓ పరిశ్రమలో తీసిందిగా గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ పరిశ్రమపై దాడిచేసిన పోలీసులు.. వీడియోలో ఉన్న మహిళ భర్త శక్తిపూర్, ఆమె మామ బిహారీ లాల్‌ను అరెస్టు చేశారు. పరిశ్రమలో సోదాలు చేయ గా.. 315 బోర్ డబుల్ బ్యారెల్ గన్లు, 315 పిస్ట్టోల్‌లు, 32 బోర్ పిస్టోల్‌లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే తుపాకులు తయారుచేసేందుకు ఉపయోగించే పరికరాలు, ముడి సరుకుతోపాటు సగం తయారు చేసిన గన్లను స్వాధీనం చేసుకున్నారు. వారిపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదు చేశారు.
నిందితులు ఆరు నెలలుగా ఫ్యాక్టరీ నడుపుతున్నారని.. వారికి ముడిసరుకు ఎక్కడి నుంచి వస్తోంది? ఆయుధాలను ఎవరికి సప్లు చేస్తున్నారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మరో వీడియో ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. మొరెనా జిల్లా పక్కనే ఉన్న డాటియా జిల్లాలోని జిగ్నా పీఎస్ పరిధిలోని గోపాలపురా నికి చెందిన ప్రాంతంలో తీసిందిగా అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి దాటియా జిల్లా ఏఎస్పీ సునీల్ శివారే మాట్లాడుతూ.. మరో వీడియోలోని మహిళ ఎవరు, ఏప్రాంతంలో ఈ తుపాకీల తయారీ కొనసాగుతోందో కనిపెట్టి తీరుతామన్నారు.
నెటిజన్ల ఆందోళన..
యూపీ, బీహార్ రాష్ట్రాల్లో తుపాకీ తయా రీ పరిశ్రమలు పెద్ద ఎత్తున ఉన్నాయని.. వీడియోల గురించి మీడియాలో కథనాలు వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు హడావిడి చేస్తారని నెటిజన్లు మండిపడుతున్నారు. ‘కట్టా (కంట్రీ మేడ్ పిస్టోల్) క్వీన్’.. ‘అబ్బాయిలు జర భద్రం’.. ‘లేడీ గన్ మెషీన్’ అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.