calender_icon.png 12 September, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ రానున్నది బీఆర్‌ఎస్ పాలనే..

11-09-2025 11:07:11 PM

-ఎమ్మెల్యే అనిల్ జాదవ్...

-కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్ లోకి చేరికలు 

ఆదిలాబాద్, సెప్టెంబర్ 11 (విజయక్రాం తి): రాష్ర్టంలో మళ్ళీ రానున్నది బీఆర్‌ఎస్  ప్రభుత్వమేనని, అన్ని గ్రామాలు అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. సిరికొండ మండలంలోని నేరడిగొండ (జి) గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు భూమేష్ తో పాటు గ్రామస్తులు దాదాపు 50 మంది అధికార కాంగ్రెస్ పార్టీని వీడి ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ సంద ర్భంగా ఎమ్మెల్యే  పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ యువ నాయకులు భూమేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సరైన గుర్తింపు లేదని అన్నా రు. ఎమ్మెల్యే నేతృత్వంలో బోథ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయగలరని భావించి బీఆర్‌ఎస్ పార్టీలో చేరమన్నారు. కార్యక్రమం లో పెంటన్న,  ఎక్బాల్,  చందు, ఆయా మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.