11-09-2025 11:02:28 PM
చేగుంట: మెదక్ జిల్లా చేగుంట మండలంలో మేకల కాపరిపై చిరుత దాడి చోటుచేసుకుంది. గ్రామ శివారులోని అడవి ప్రాంతంలో మేకలు మేపుతున్న పట్నం రాజు, తన మేకలను మేపుకొని తిరిగి ఇంటికి వస్తుండగా ఒక్కసారి మేకల మందపై చిరుత పులి దాడి చేసింది. ఇదే క్రమంలో అక్కడే ఉన్న మేకల కాపరి రాజు చిరుతపులిని అడ్డగించడంతో తిరిగి, చిరుతపులి రాజుపై దాడికి దిగింది, రాజు ఒక్కసారిగ గట్టిగ అరిచి తన చేతిలో ఉన్న గొడ్డలితో చిరుతపై దాడి చేసాడు, అప్పుడు చిరుత అడివిలోకి పారి పొహింది, రాజు అడివి నుండి ఇంటికి వస్తున్నప్పుడు, వెనుక నుండి తన పై దాడి చేసినట్టు రాజు తెలిపాడు. అక్కడే ఉన్నా మరికొంతమంది మేకల కాపర్లు చిరుతపై దాడికి వెళ్లడంతో, అది రాజుపై స్వల్ప గాయాలు చేసి పారిపోయినట్లు మేకల కాపరులు తెలిపారు. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు విచారణ చేపట్టారు. ఇట్టి విషయంపై ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కిరణ్ కుమార్ సంప్రదించగా మేకల మందపై చిరుత దాడి నిజమేనని ధ్రువీకరించారు.