calender_icon.png 12 September, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్కే మేజర్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం

11-09-2025 11:07:59 PM

చిలుకూరు: చిలుకూరు మండలం రామచంద్రనగర్ గ్రామంలో ఆర్కే మేజర్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గురువారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆర్కే మేజర్ కాలువలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైందని పోలీసులు తెలిపారు. వయస్సు 50 నుండి 55 సంవత్సరాలు కలిగిన ఆడమనిషి మృతదేహం, రెండు చేతులపై పచ్చబొట్లు, రెండు ముక్కులకు ముక్కుపుడకలు, రెండు చెవులకు మాటీలు ఉన్నాయని, మృతదేహం ఎక్కడిది దర్యాప్తు చేస్తున్నామని.. వివరాలు తెలియాల్సి ఉందని, ఎస్సై, సురేష్ రెడ్డి తెలిపారు.