calender_icon.png 12 September, 2025 | 1:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలి

11-09-2025 10:41:53 PM

వ్యకాస జిల్లా కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్

మణుగూరు (విజయక్రాంతి): ఉపాధి కూలీల పెండింగ్ వేతనాలు తక్షణమే చెల్లించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సంఘం ఆధ్వర్యంలో  గురువారం ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా చేసి పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో కు అందజేశారు. శ్రీనివాస్ మాట్లాడాతూ.. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు బడ్జెట్ ను కుదిస్తూ కూలీల పొట్ట కొడుతుందని ఆరోపించారు. పని ప్రదేశంలో ఫోటోలు తీసే పద్ధతిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి కూలీలు మండు టెండల్లో చేతులకు బొబ్బలు వచ్చేలా పనులు చేసిన నేటికీ కూలీలకు వేతనాలు అందక పోవడం దారుణమన్నారు. మూడు నెలల వేతనాలు లేక కూలీలు అర్ధాకలితో అలమటిస్తు  న్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. కూలీలకు వారం వారం బిల్లులు చెల్లించాలని, పెండింగ్ లో  బిల్లులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.కార్యక్రమంలో పిట్టల నాగమణి, మాచారపు లక్ష్మణరావు,బోడ నాగమణి, శైలజ ,కళ్యాణి,రజిత,వాసవి, రవి పాల్గొన్నారు.