11-09-2025 10:54:06 PM
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి పరిశ్రమను పరిరక్షించి కార్మికుల న్యాయ మైన హక్కులను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ మజ్దూర్ సంఘ్(Bharatiya Mazdoor Sangh) ఆధ్వర్యంలో జిఎం కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బిఎమ్ఎస్ సింగరేణి విభాగం అధ్యక్షులు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ దేశవ్యాప్త బొగ్గు పరిశ్రమ, సింగరేణి పరిశ్రమ పరిరక్షణ కార్మిక హక్కుల సంరక్షణ కొరకు దీర్ఘకాలిక ఆందోళన కార్యక్రమాలు జూలై 23 నుండి సెప్టెంబర్ 17 వరకు దేశవ్యాప్త ఉద్యమాలు నిర్వహిస్తున్నామన్నారు. పర్మినెంట్ కార్మికులను కాంట్రాక్ట్ కార్మికులను ప్రభావిత గ్రామాల ప్రజలను చైతన్య పరుస్తూ దేశవ్యాప్తంగా ఉన్న బొగ్గు పరిశ్రమల, సింగరేణి సమస్యలను పరిష్కారం కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యాజమాన్యాలు పరిశ్రమల ప్రగతి నూతన బొగ్గు బావుల ఏర్పాటు, కార్మికుల సంక్షేమ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన విద్యుత్తు బొగ్గు బకాయిలు రూ.42,739 కోట్లు వెంటనే చెల్లించాలని, బొగ్గు ఉత్పత్తిలో 50 శాతం పర్మనెంట్ కార్మికుల ద్వారా తీయాలని డిమాండ్ చేసారు. 2024-25 ఆర్థిక సంవత్సరానికి వచ్చిన వాస్తవ లాభాలపైన 40 శాతం వాట వెంటనే చెల్లింపు తేదీని ప్రకటించి పంపిణీ చేయాలన్నారు.దేశవ్యాప్తంగా బొగ్గు పరిశ్రమలలో సభ్యత్వ వెరిఫికేషన్ ఆధారముగా నడుస్తున్న పద్ధతిని సింగరేణిలో అమలు చేయాలనీ, ప్రజాస్వామ్య పద్ధతిని కొనసాగించాలని, కోల్ ఇండియా మాదిరిగా అలవెన్స్ లపై ఆదాయ పన్ను రియంబర్స్ మెంటు చెల్లించాలన్నారు. సింగరేణి సంస్థలో రాజకీయ జోక్యం ఉండరాదని పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం కార్మిక సంఘాల ప్రాతినిధ్యం కొనసాగించాలని,సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలని, కార్మికుల మెరుగైన వైద్యం కొరకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ని ఏర్పాటు చేయాలని కోరారు.
జాతీయ సంపదను తీయుటలో కాలుష్య నివారణ పెరుగుతున్న క్రమంలో కాలుష్య నివారణకు నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, సింగరేణి ప్రతి కార్మికునికి 250 గజాల భూమి, 50 లక్షల వడ్డీ లేని రుణం సొంతింటి పథకం అమలు చేయాలని డిమాండ్ చేసారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎస్ఓటు జీఎం విజయప్రసాద్ కు అంద జేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారంపూడి శ్రీనివాసరాజు, డొనికెల రమేష్, గుర్రం ప్రదీప్ కుమార్, చెట్టు వీరన్న, ఊరకొండ తిరుపతి, అచ్చ ప్రదీప్ కుమార్, మంద రజినీకాంత్, మల్యాల రాజమల్లు, సప్పిడి నరేష్, రవి సాగర్, పోతులూరి రాజేందర్, ఉగాది రాములు, శనిగారపు శ్రీనివాస్, తుపాకుల శ్రీనివాస్, మహిళా ప్రతినిధులు నల్ల సంగీత, వసంత, కమల, లక్ష్మి, కమల విజయ, మంద నాగమణి, ఆరుముళ్ళ లక్ష్మి, వేల్పుల దేవమ్మ, పుల్యాల ధనలక్ష్మి, సోకాసి సత్తక్క, బొంతల రమాదేవి లు పాల్గొన్నారు.