calender_icon.png 25 September, 2025 | 6:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడిసిటీ, సనాతన జీవన ట్రస్ట్ మధ్య వైద్య సేవలపై ఒప్పందం

25-09-2025 12:32:15 AM

మేడ్చల్, సెప్టెంబర్ 24(విజయ క్రాంతి): మెడిసిటీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, చీరాలలోని సనాతన జీవన్ ట్రస్ట్  వైద్య సేవల విషయమై కలిసి పని చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. ఆధునిక వైద్య పరిశోధనలో సంప్రదాయ, భారతీయ వైద్య విజ్ఞానాన్ని జోడించి సంపూర్ణమైన ఆరోగ్య విధానాల రూపకల్పనకు కృషి చేస్తాయి.

ఈ సందర్భంగా మెడిసిటీ ప్రెసి డెంట్ ప్రొఫెసర్ కే శివరామకృష్ణ మాట్లా డుతూ ఈ రెండు సంస్థలు కలిసి పని చేయ డమే కాకుండా ప్రత్యేకమైన పరిశోధనలు నిర్వహిస్తాయని అన్నారు. అల్లోపతి, సంప్రదా య వైద్య విధానాలలోని మంచి పద్ధతులను గుర్తించి వాటిని అవసరమైన రీతిలో రోగులకు అందించడానికి చర్యలు తీసుకుంటాయన్నారు.

కాగా, గైనకాలజీ విభాగం హెచ్ ఓ డి డాక్టర్ కల్పన సమర్పిం చిన పరిశోధన పత్రానికి డాక్టర్ ఎస్ కె ఘాయి బండారి అవార్డు లభించింది. పరిశో ధన పత్రంలో గ్రామీణ ప్రాంతాలలో మహిళలు ఇంటి వద్దనే చేయించుకునే పరీక్షల నాణ్యత, వాటి వినియోగం, ఆ పరీక్ష శాంపిల్ ఖచ్చితత్వం పలు విషయాలను డాక్టర్ కల్పన వివరించారు.