calender_icon.png 25 September, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎన్నికల హామీలు నెరవేర్చడంలో బీజేపీ విఫలం

25-09-2025 12:33:04 AM

  1. బ్యాంకు రుణాల మాఫీలో లక్ష కోట్ల అవినీతి 
  2. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్

ఖైరతాబాద్, సెప్టెంబర్ 24 (విజయ క్రాంతి) : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింత మోహన్ అన్నారు. ఈ మేరకు బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

నరేంద్ర మోడీ 11 సంవత్సరాల క్రితం నల్లధనాన్ని బయటకు తీసి ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తానని, అలాగే సంవత్సరానికి రెండు లక్షల కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారని అధికారంలో వచ్చే 11 సంవత్సరాలు గడుస్తున్న ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని దుయ్యబ ట్టారు.

భారతదేశంలో బ్యాంకులను ఇందిరా గాంధీ జాతీయం చేస్తే, మోడీ ప్రభుత్వం రైతులకు, నిరుపేదలకు రుణమాఫీ చేయకుండా దేశంలో ఉన్న కోటీశ్వరులకు రుణ మాఫీ చేసిందని విమర్శించారు. రుణమాఫీ పొందిన వారిలో గుజరాత్ కు సంబంధించిన మార్వాడిలే ఎక్కువమంది ఉన్నారని అన్నారు. బ్యాంకు రుణాల మాఫీలో లక్ష కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఈ శతాబ్ది కాలంలో ఇదే అతి పెద్ద స్కామ్ అని తెలిపారు.

రష్యా పెట్రోల్ ముడి చెరుకును రూ.30కే ఇస్తుంటే మోడీ తన స్నేహితులకు సహాయం చేస్తూ వేలకోట్ల రూపాయలను సంపాదించుకుంటున్నారని తెలిపారు. దేశం లో నిరుద్యోగులు ఎంతో నిరాశతో ఉన్నారని, నిరుపేదలు ఆకలితో అలమటిస్తున్నా రని, భారతదేశం చాలా కష్టాల్లో ఉంది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మన్మో హన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకువచ్చిన ఆర్థిక సంస్కరణల వలన భారతదేశ ప్రగతి పథంలో నడుస్తుందని తెలిపారు.