25-09-2025 12:31:46 AM
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్
జగిత్యాల అర్బన్, సెప్టెంబర్ 24)విజయ క్రాంతి): మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కు టుంబం తద్వారా సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్ట ర్ సంజయ్ కుమార్ అన్నారు. బుధవారం జగిత్యాల ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో ఒమేగా సుశ్రుత హాస్పిటల్ ఆధ్వర్యంలో రోటరీ క్లబ్, ఆపి, ఇండియన్ రెడ్ క్రాస్ సొ సైటీ సహకారంతో ఉచిత మెగా క్యాన్సర్ ప రీక్ష శిబిరాన్ని ప్రారంభించి,క్యాన్సర్, స్వస్త నారి స్వశక్త పరివార్ కార్యక్రమ పరీక్షల సరళిని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పరి శీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూరోగం వచ్చాక చికిత్స కన్నా రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం,ముంద స్తు పరీక్షలు చేసుకోవడం ఉత్తమమన్నా రు.ప్రజల రోజు వారి జీవన విధానం, వ్యా యామం,వాకింగ్ ద్వారా ఆరోగ్యన్నీ కాపాడవచ్చని తెలిపారు. ప్లాస్టిక్ వాడకం తగ్గించడం ద్వారా క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు. స్వస్త్ నారి స్వశక్త పరివార్ కార్యక్రమన్నీ మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రధానంగా మహిళలు ఆరోగ్యావంతంగా ఉంటేనే, సమాజం, కుటుంభం బా గుంటుందన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పోలి యో నివారణ లో రోటరీ క్లబ్ క్రియాశీలక పాత్ర వహించిందని తెలిపారు. జిల్లా కేంద్రంలో క్రిటికల్ కేర్ యూనిట్ త్వరలో ప్రారంభం కానుందని,రు.200 కోట్ల తో 200 పడకల ఆసుపత్రి కి త్వరలో భూమిపూజ చేయటం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్ లత, జిల్లా వైద్యాధికారి ప్రమోద్, ఉప వైద్యాధికారి శ్రీనివాస్,సుశృత, ఒమేగా హాస్పిటల్ ఆంకలజీ సర్జన్ డా.రనదీప్ రెడ్డి, డా.దీప్తి, ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సభ్యు లు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టివి సూర్యం, రోటరీ క్లబ్ సభ్యులుకొత్త ప్రతాప్, రాజు, ఆసుపత్రి ఆర్ ఎం ఓ డా.గీతిక, ఇం చార్జి సూపరింటెండెంట్ డా .సుమన్, డా. అర్చన మాజీ కౌన్సిలర్ లు కుసరి అనిల్, ముస్క నారాయణరెడ్డి వైద్య సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.