calender_icon.png 22 August, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహిళా రైతులకు వ్యవసాయ పనిముట్లు

22-08-2025 06:24:11 PM

చిట్యాల,(విజయక్రాంతి): రాష్ట్రీయ కృషి వికాస్ యోజన(ఆర్ కెవివై) కింద రైతులకు వ్యవసాయ పనిముట్లు,యంత్రాలు అందించేందుకు మహిళా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తునట్లు చిట్యాల మండల వ్యవసాయ అధికారి సీ.ఎచ్ శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సబ్సిడీపై యంత్రాలు, పనిముట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు వచ్చాయన్నారు.

మండలానికి బ్యాటరీ స్ప్రేయర్స్ 90, పవర్ స్ప్రేయర్స్ 29, రోటావేటర్స్ 6, కల్టివేటర్లు, ప్లౌ 8,సీడ్,కం ఫర్టిలైజర్ డ్రిల్ 1,బ్రష్ కట్టర్ 2, పవర్ టిల్లర్ 1, స్ట్రా బేలర్-2 తదితర పనిముట్లు రాయితీపై ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయని, ఆసక్తి, అర్హత గల రైతులు వెంటనే దరఖాస్తుతో పాటు ఫొటో, పట్టాదారు పాస్ పుస్తకం,ఆధార్ జిరాక్స్,ట్రాక్టర్ తో పని చేసే యంత్రాలకు ట్రాక్టర్ రిజిస్ట్రేషన్ పత్రాలు జతచేసి మండల వ్యవసాయ కార్యాలయంలో అందజేయాలని కోరారు. ఆసక్తి గల మహిళా రైతులు, ఎస్సీ,ఎస్టి సన్నకారు మహిళ రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.