calender_icon.png 8 September, 2025 | 7:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాయితీపై వ్యవసాయ పనిముట్లు..

08-09-2025 04:09:38 PM

మండల వ్యవసాయ అధికారిని కిరణ్మయి..

మందమర్రి (విజయక్రాంతి): వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా ఎస్ఎంఎఎం పథకంలో భాగంగా 40% రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందజేస్తున్నట్లు మండల వ్యవసాయ అధికారిణి జి.కిరణ్మయి(Mandal Agriculture Officer Kiranmayi) తెలిపారు. మండలంలోని సండ్రోన్ పల్లి రైతు వేదికలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. ఎస్ఎంఎఎం పథకంలో భాగంగా మండలానికి 135 యూనిట్లు మంజూరు అయ్యాయని, దీనిలో 101 బ్యాటరీ/మ్యాన్యువల్/ఫూట్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు, 18 పవర్ ఆపరేటెడ్ స్ప్రేయర్లు, 6 రొటోవేటర్లు, 1 సీడ్ కం ఫర్టీ డ్రిల్లు, 6 డిస్క్ హారో/కల్టివేటర్లు/ప్లవ్/కేజ్ వీల్స్/రోటోపడ్లర్, 1 పవర్ వీడర్, 1 బ్రష్ కట్టర్, 1 పవర్ టిల్లర్ మంజూరు అయ్యాయని వివరించారు. ఆసక్తి కలిగిన రైతులు ఈ నెల 13 వ తేదీ లోపు  పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్, ఆధార్ జిరాక్స్, బ్యాంక్ పాస్ పుస్తకం జిరాక్స్, పాసుపోర్ట్ ఫోటోతో మండల వ్యవసాయ విస్తరణ అధికారికి తమ దరఖాస్తులు సమర్పించాలన్నారు. మరిన్ని వివరాల కొరకు వ్యవసాయ విస్తరణ అధికారిని  గాని లేదా మండల వ్యవసాయ అధికారిని గాని సంప్రదించాలని కోరారు.