08-09-2025 04:14:41 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో అర్హులైన పేదలందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేసి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ 3016 రూపాయలు చెల్లించాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్(Aam Aadmi Party District Convener Syed Haider) డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు పేద ప్రజలకు పెన్షన్లను పెంచుతామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు పెన్షన్లు పెంచకపోవడం వల్ల పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న మంజూరు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలోని వివిధ గ్రామాల్లో పెన్షన్ల కోసం నిరుపేదలు ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.