12-10-2025 03:02:57 AM
హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : తెలంగాణ పాలిట పెను ప్రమా దంగా మారబోతున్న బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీం కోర్టుకు వెళ్లి రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు, హక్కులను కాపాడుతామని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపా రు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు విషయంలో అడ్డగోలుగా కెనాల్‌లు తవ్వి తెలంగాణ నీళ్లు తన్నుకుపో తుంటే కేంద్రం, రాష్ర్ట ప్రభుత్వం ఏం చే స్తున్నాయి..?. న్యాయవాదులతో కేసీఆర్ మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సుప్రీం కోర్టుకు వెళ్లకున్నా బీఆర్‌ఎస్ రా ష్ర్ట ప్రయోజనాల కోసం పోరాడుతుందని, అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లి హ క్కులను కాపాడుతుందని ఆయన స్పష్టం చేశారు.
శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. ఏపీ అక్రమం గా నిర్మిస్తున్న బనకచర్ల ప్రాజెక్టు విషయంలో బీఆర్‌ఎస్ చేసిన హెచ్చరికలు ఒక్కొక్కటిగా నిజమవుతున్నాయని చె ప్పారు. కేంద్రంలోని బీజేపీ సహకారం తో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఉన్న అడ్డంకులను తొలగించుకుంటూ నీళ్లు దోచుకుపోవాలని ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..
గోదావరి బనకచర్ల ప్రాజెక్టు పీఎఫ్‌ఆర్ టెక్నో ఎకనామికల్ అప్రైజల్ కోసం వచ్చిందని, అనుమతుల ప్రక్రియ ప్రోగ్రస్‌లో ఉం దని, ప్రాసెస్ చేస్తున్నం అని స్పష్టం చేస్తూ.. జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ సెప్టెంబర్ 23, 2025 తేదీన సీఎం రేవంత్‌రెడ్డికి ఉత్తరం రాసినప్పటికీ వ్యతిరేకించాల్సింది పోయి పరోక్షంగా సహకరిస్తున్నారని ఆరోపించారు. వరద జలాల మీద ప్రాజెక్టు ఎలా కడుతారని కేంద్రాన్ని నిలదీయాల్సిన సీఎం మౌనంగా ఉన్నారని విమర్శించారు. రాష్ర్ట ప్రయోజనా లు కాపాడుతవా, కమీషన్ల కోసం మౌనంగా ఉంటూ స్వార్థం చూసుకుంటావా అని ప్రశ్నించారు.
తెలంగాణ రెంటికి చెడ్డ రేవడిలా..
గతంలో కర్ణాటక ప్రభుత్వం జలశక్తి మం త్రిత్వ శాఖకు రాసిన లేఖలో కృష్ణాలో 112 టీఎంసీల నీళ్లు ఆపుకుంటామని స్పష్టం చేసిందని, కర్ణాటక నీళ్లు ఆపితే తెలంగాణ పరిస్థితి ఏం కావాలన్నారు. 423 టీఎంసీల గోదావరి జలాలు ఏపీకి, 112 టీఎంసీల కృష్ణా జలాలు కర్ణాటకకు అర్పణం అయితే తెలంగాణ మిగిలేది ఏమిటని ప్రశ్నించారు. మరోవైపు మహారాష్ట్ర కృష్ణాలో 74 టీఎంసీలు తమ వాటా నీళ్లు ఆపుకుంటామని, వరద ప్రాజెక్టులు కట్టి విదర్భకు నీళ్లు తీసుకుపోతం అంటున్నదని తెలిపారు. ఈ క్రమంలో తెలంగాణ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడి లాగా అయ్యిందన్నారు.
ఇంత స్పష్టం గా ఆయా రాష్ట్రాలు ముందుకు పోతుంటే మన ప్రభుత్వం ఏం చేస్తున్నదని, మొద్దు నిద్ర పోతున్నదా అని ప్రశ్నించారు. పోలవ రం బనకచర్ల లింక్ ప్రాజెక్టు సాధ్యం కాదని సెంట్రల్ వాటర్ కమిషన్, జీఆర్‌ఎంబీ, మినిస్టరీ ఆఫ్ ఫారెస్ట్, పోలవరం ప్రాజెక్టు అథారి టీ ఇప్పటికే స్పష్టం చేసాయని, అప్పుడు తప్పు అన్న కేంద్రం ఇప్పుడు ఎందుకు ముం దుకు పోతున్నదన్నారు. చంద్రబాబు ఒత్తిడి తో బీజేపీ తలొగ్గుతున్నదని, కేంద్ర మంత్రు లు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు బాధ్యత లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని, ఎనిమిది, ఎనిమిది కలిస్తే గుండు సున్నానా అని ఎద్దేవా చేశారు. అన్ని ఆధారాలతో సుప్రీంకోర్టుకు ఎందుకు వెళ్లడం లేదని నిలదీశారు.
రేవంత్‌రెడ్డి .. నల్లమల పులా, పిల్లా, ఎలుకనా?
బనకచర్ల డీపీఆర్ కోసం టెండర్లు పిలుస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి మౌనంగా ఉండ టం సిగ్గుచేటన్నారు. పోలవరం 11,500 క్యూసెక్కులకే అప్రూవ్ అయ్యిందని, గతంలో కెనాల్‌ను 18వేలకు పెంచితేనే బీఆర్‌ఎస్ ప్రభుత్వం అడ్డుకుంటే కేంద్రం డబ్బులు ఆపిందని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి వచ్చాక ఇప్పుడు కెనాల్ 18 వేల నుంచి 23 వేల క్యూసెక్కులకు పెంచుతున్నదని, దీనికి రేవంత్‌రెడ్డి పరోక్షంగా సహకరిస్తున్నారని విమ ర్శించారు. రేవంత్‌రెడ్డి అంటే తెలంగాణ ద్రోహి, ఎన్నడూ జై తెలంగాణ అనలేదని, ఒక్కనాడు రాజీనామాలు చేయలేదని గుర్తు చేశారు. కేబినెట్‌లో తెలంగాణ సోయి ఉన్న ఒక్క మంత్రి లేరా అని ప్రశ్నించారు. నల్లమ ల గుండా పోయే కృష్ణా నీళ్లలో అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉంటున్న రేవంత్‌రెడ్డి నల్లమల పులా, పిల్లా, ఎలుకనా అని ఎద్దేవా చేశారు.
ఆల్మట్టి అంశంలో ఢిల్లీ కాంగ్రెస్‌తో కర్ణాటక కాంగ్రెస్‌కు ఒక్క మాట చెప్పించాల్సిం దని, ఎప్పుడు ఢిల్లీకి బ్యాగులు మోసుడే కాదు.. అప్పుడప్పుడు ప్రజల బాగోగులు కూడా మోయాలని హితవు పలికారు. రాష్ర్ట ప్రయోజనాల పట్ల సీఎంకు చిత్తశుద్ధి కాదు, అసలు చిత్తమే లేదన్నారు. తెలంగాణ హక్కు ల కోసం బీఆర్‌ఎస్ కొట్లాడుతున్నదని, బనకచర్ల విషయంలో ముందు అప్రమత్తం చేశామని గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని, నియమ నిబంధనలను కాపాడాల్సిన బీజేపీ కళ్లు మూసుకొని ఉంటున్నదని చెప్పారు. తెలంగాణ హక్కులను కాపాడేది కేసీఆరే, బీఆర్‌ఎస్ పార్టీనే అని స్పష్టం చేశారు.