calender_icon.png 12 October, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బరిలో దిగుతాం!

12-10-2025 02:58:42 AM

  1. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయాలని నిరుద్యోగ యువత నిర్ణయం
  2. నాడు జలసాధన సమితి తరహాలో ప్రభుత్వానికి నిరసన సెగ  
  3. జాబ్ నోటిఫికేషన్లు వేయకుండా సర్కారు మోసం చేసిందంటూ ఆగ్రహం

హైదరాబాద్, అక్టోబర్ 11 (విజయక్రాంతి): ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో తెలంగాణ  ప్రభుత్వంపై నిరుద్యోగ యువ త గుర్రుగా ఉంది. కృష్ణా జలాల సా ధనలో భాగంగా నాడు జలసాధన సమితి అధ్యక్షుడు దుశ్చర్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో అప్పటి ప్రభుత్వానికి పోటీగా నల్ల గొండ జిల్లాలోని మునుగోడు, దేవరకొండ ని యోజకవర్గాల ప్రజలు ఎన్నికల్లో నామినేషన్లు వేసిన మాదిరిగానే .. ప్రస్తుత కాం గ్రెస్ ప్రభుత్వానికి కూడా నిరుద్యోగ యువ త నిరసన సెగ చూపించాలనుకుంటోంది. అందులో భాగంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో పాలక ప్రభుత్వానికి పోటీగా నిలవాలని నిర్ణయించుకుంది.

కాంగ్రెస్ ప్ర భుత్వం జాబ్ నోటిఫికేషన్లు వేయడంలేదని అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు పలువురు అభ్యర్థులు ప్రకటించారు. ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ... ప్రభు త్వానికి తమ నిరసన తెలియజేసేలా పదు ల సంఖ్యలో నిరుద్యోగ అభ్యర్థులు సమాయత్తమవుతున్నారు. దాదాపు రెండేళ్లు కావొస్తున్నా ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేస్తుందంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.

వెయ్యి నామినేషన్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రస్తుతానికి 30మంది అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ సం ఖ్య వెయ్యికి పెరుగుతుందని ఓ అభ్యర్థి తెలిపారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న ఒక జనరల్ ఉద్యో గ నోటిఫికేషన్ కూడా వేయలేదని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదా పు 30లక్షల మంది నిరుద్యోగులకు ఈ స ర్కారు మోసం చేసిందని వారు మండిపడుతున్నారు. జీపీవో (గ్రామపాలన అధికా రు లు), డీఎస్సీ, గ్రూప్1, 2, 3, 4, ఎస్‌ఐ, పో లీస్ కానిస్టేబుల్‌తోపాటు మరికొన్ని నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఈ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతు న్న అభ్యర్థులు పోటీ చేస్తామని చెబుతున్నారు.

అంతేకాకుండా జీవో నెం.46, జీవో నెం. 29 కార ణంగా నష్టపోయిన అభ్యర్థు లు సైతం నామినేషన్లు దాఖలు చేయబోతున్నట్లు తెలిసింది. మొత్తం 30అంశాలపైన నామినేషన్లు దాఖ లు చేయబోతున్నారు. జీపీవో నోటిఫికేషన్ వేయాలని ఒకరు, డీఎస్సీ నోటిఫికేషన్లు వేయాలని కొందరు, ఎస్‌ఐ, కానిస్టేబుల్ నోటిఫికేషన్లు వేయాలని, జీవో నెం.46, జీవో నెం.29లను రద్దు చేయాలని, జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వేయాలని, ఫారె స్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ నోటిఫికేషన్లు వేయాలని ఒక్కొక్కరు చొప్పు న ఇలా పదుల సంఖ్యలో నామినేషన్లు వేసేందుకు సన్నద్ధమవుతున్నారు. 

అసంతృప్తిలో నిరుద్యోగ యువత...

ఉద్యోగాల భర్తీపై నిరుద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎన్నికల సమయం లో ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ నెరవేరకపోవడంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్య క్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌తో పాటు స్థానిక సంస్థలు ఒకవేళ జరిగితే జాబ్ క్యాలెండర్ గురించి నాయకులను ప్రశ్నించాలని నిరుద్యోగులు పిలుపునిస్తున్నారు. ప్రభుత్వం 60 వేల ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నా, వాస్తవంగా 11 వేల ఉద్యోగాలే ఇచ్చారని నిరుద్యో గులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వం తరహాలోనే ఈ ప్రభుత్వం కూడా నిరుద్యోగులను పట్టించుకోవడంలేదని, జాబ్ క్యాలెండర్‌పైన స్పష్టమైన హామీ ఇవ్వడంలేదని నిలదీస్తున్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన నిరుద్యోగుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభు త్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లను తమ ఖాతా లో వేసుకుంటోంది కానీ, కొత్తగా వేసిన నోటిఫికేషన్లు పెద్దగా లేవని విమర్శిస్తున్నారు. డీ ఎస్సీ నోటిఫికేషన్, గ్రూప్ 1లో కొన్ని పోస్టు లు పెంచడం మినహా ప్రభుత్వం తీసుకున్న చర్యలేం లేవని అభ్యర్థులు పేర్కొంటున్నారు. 

డీఎస్సీలో మా కోటా పెంచాలి

25 వేల టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ వేయాలి. అలాగే ఎస్జీటీ వాళ్లతో స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులను 70 శాతం ప్రమోషన్లతో నింపుతున్నారు. 30 శాతం ఖాళీలను భర్తీ చేస్తున్నారు. దీంతో బీఎడ్ చేసినవాళ్లు నష్టపోతున్నారు. జీవో నెం.108 రద్దు చేసి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టుల భర్తీ పెంచాలి. తమ దక్కాల్సిన 30 శాతం వాటా ప్రకారం చూసుకున్న 10,200 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయాలి. కానీ, అధికారులు ఇంత మొత్తంలో పోస్టులే లేవని సగమే ఉన్నాయని చెబుతున్నారు. ఈ పోస్టులు ఎటు పోయాయి.  

 బూక్య కుమార్, తెలంగాణ బీఎడ్ అభ్యర్థులు సంఘం అధ్యక్షుడు

గోడు వినిపించేందుకే నామినేషన్లు

తమ గోడు వినిపించేందుకు ఉప ఎన్నికల్లో నామినేషన్లు వేయాలని అనుకుంటున్నాం. తాము ఏ పార్టీకి అనుకూలం కాదు, వ్యతిరేకం కాదు. 5,944 జీపీవో పోస్టులు ఖాళీగా ఉన్నా యి. వీటిని భర్తీ చేస్తే చాలా మంది డిగ్రీ అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకొని పోటీ పడతారు. అలాగే ఫారెస్ట్ బీట్, రేంజ్ ఆఫీసర్స్, వివిధ పోస్టులను భర్తీ చేయాలి. జీపీవో పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ  వందలాది మందితో ర్యాలీగా వెళ్లి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ వేస్తా. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా మరికొంత మంది నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. తమ నిరస నను తెలియజేసేందుకే నామినేషన్లు దాఖలు చేయాలని నిర్ణయించాము. ప్రభుత్వం వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలి.

 కొలుకులపల్లి రామకృష్ణ వన్నార్ చోళ, నిరుద్యోగ అభ్యర్థి