12-10-2025 03:12:48 AM
ఓరుగల్లు రాజకీయాల్లో మంత్రి పొంగులేటి పెత్తనమేంది?
కాంగ్రెస్ అధిష్ఠానానికి కొండా దంపతుల ఫిర్యాదు
మేడారం జాతర పనుల టెండర్ వివాదం
కొండా సురేఖ, మురళి X పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
ఈసారీ మంత్రుల మధ్యే..
రూ.71 కోట్ల పనులను తనవారికే కట్టబెట్టే యత్నం
* అధికార కాంగ్రెస్‌లో పూటకో పంచాయితీ.. రోజుకో లొల్లి తెరమీదికి వస్తోంది. మంత్రులు, నాయకుల మధ్య నెలకొన్న అంతర్గత విబేధాలు రచ్చకెక్కుతుండటంతో అటు పార్టీకి, ఇటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. మంత్రులు, పార్టీ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, ఒకరి శాఖలో మరొకరు జోక్యం చేసుకోవద్దని పార్టీ అధిష్ఠానం హెచ్చరించినా కొందరు మంత్రులు పెడచెవిన పెడుతున్నారు.
ఐదారు రోజుల క్రితం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యల పంచాయితీ సమసిపోయిన తరుణంలో తాజాగా.. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మేడారంలో ఆలయ పునరుద్ధరణ పనులకు సంబంధించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మరో మంత్రి కొండా సురేఖ మధ్య రూ.71 కోట్ల టెండర్ వ్యవహారం రచ్చకెక్కింది. దేవాదాయ శాఖకు సంబంధించిన పనుల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జోక్యమెందుకని కొండా సురేఖ బాహాటంగానే విమర్శిస్తున్నారు.
ఇక కొండా సురేఖ భర్త కొండా మురళి కూడా వరంగల్ రాజకీ యాల్లో మంత్రి పొంగులేటి పెత్తనమేంటి..? అని ప్రశ్నిస్తు న్నారు. వరంగల్ జిల్లాలో పొంగులేటి అనవసర రాజకీ యం చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి కూడా తీసుకె ళ్లారు. సోమవారం ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ అధిష్ఠానానికి పొం గులేటిపై ఫిర్యాదు చేయనున్నారు. ఇదే అంశాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గేకు మంత్రి కొండా సురేఖ ఫోన్‌లో వివరించినట్టు తెలిసింది.
హైదరాబాద్/వరంగల్, అక్టోబర్ 11 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇటీవలనే మే డారం ఆలయాన్ని సందర్శించారు. సమక్క , సారలమ్మ ఆలయ పునురుద్ధరణ పనుల కోసం రూ. 150 కోట్లు ప్రకటించారు. ముందుగా రూ.71 కో ట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ రూ. 71 కోట్ల నిధులు మంత్రి కొండా సురేఖ నిర్వహిస్తున్న దేవాదాయ శాఖ నుంచి విడుదలయ్యాయి. కొండా సురేఖ సొంత జిల్లా వరంగల్ కావడం, నిధులు కూడా ఆమె నిర్వహిస్తున్న దేవాదాయ శాఖ నుంచే విడుదల చేయడం జరిగింది.
ఈ పనులకు సంబం ధించిన టెండర్లు కొండా సురేఖ ప్రమేయం లేకుండానే జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తన అనుచరులకు ఇప్పించుకునే విధంగా నిర్ణయాలు తీసుకున్నారని మంత్రి కొండా సురేఖ దంపతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో తా ము నిమిత్తమాత్రంగా ఉండే పరిస్థితిని సృష్టిస్తున్నారని, ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి వరంగల్ రాజకీయాల్లో, అభివృద్ధి పనుల్లో జోక్యమెందుకని కొండా సురేఖ, ఆమె భర్త, కాంగ్రెస్ నాయకుడు కొండా మురళి ప్రశ్నిస్తున్నారు. వరంగల్ జిల్లాలోని భద్రకాళి ఆలయం ట్రస్టుబోర్డు స భ్యుల నియామకంలోనూ గతంలో మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మధ్య కూడా మనస్పర్థలు ఏర్పడ్డాయి.
కొండా దంపతులకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అనుచరవర్గం బలంగా ఉండటంతో పాటు రాజకీయాల్లో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఇది జీర్ణించు కోలేని కొందరు ఎమ్మెల్యేలు.. రేవూరి ప్రకాష్‌రెడ్డి, కడియం శ్రీహరి, నాయిని రాజేందర్‌రెడ్డితో పాటు మరికొందరు కొండా సురేఖకు వ్యతిరేకంగా ఏకమయ్యారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. దీనితో కడి యం శ్రీహరి, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, నాయిని రాజేందర్‌రెడ్డిపై కొండా దంపతులు చేసిన వ్యాఖ్యలు వివా దస్పదమైనాయి.
ఇరువర్గాలు పీసీసీ క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేయడం, క్రమశిక్షణ కమిటీ ఇరువురికి నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవడం జరి గింది. కానీ ఫలితం మాత్రం ఇంకా తేల్చడం లేదు. వరంగల్ జిల్లాలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేల మధ్య నెలకొన్న పంచాయితీ ఇంకా సమసి పోలేదు. ఇప్పుడు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వర్సెస్ కొండా సురేఖ మధ్య నెలకొన్న టెండర్ వార్ ఎక్కడికి దారితీస్తుందనేది చర్చగా మారింది.
జాతర పనుల్లో అవినీతి ?
ప్రతిసారి మేడారం జాతర నిర్వహణ కోసం ప్ర భుత్వాలు కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం, తూతూ మంత్రంగా జాతరకు ముందు పనులు చేపట్టడం.. అవి భక్తులకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోవడం పరిపాటిగా మారింది. దీనితో మేడారం జాతర పనులు పూర్తిగా పక్కదారి పడుతున్నాయని విమర్శలు వినిపించడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలో ఈసారి అలాకాకుండా 150 కోట్ల రూపాయలతో మేడారం జాతరను అన్ని హంగులతో నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపాదించగా, ఇప్పుడు పనుల నిర్వహణలో మంత్రుల మధ్య విభేదాలు తలెత్తడంతో అవినీతి కలంకం అంటుకున్నది.
జాతర పనుల్లో ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా చేపట్టాలని, మంత్రి పొంగులేటి ప్రతివారం పర్యవేక్షించాలని స్వయంగా సీఎం ఆదేశించిన నేపథ్యంలో పనుల కేటాయింపు వివాదాన్ని మంత్రి కొండా సురేఖ లేవనెత్తడం విమర్శలకు తావిస్తోంది. ఎప్పట్లాగే మేడారం జాతర ఈసారి కూడా నేతలకే లబ్ధి చేకూర్చే విధంగా మారుతున్నదనే విమర్శలు వస్తున్నాయి.
అటవీశాఖపై మంత్రి వివేక్ సమీక్ష
ఇటీవల మంత్రి కొండా సురేఖ, మరో మంత్రి వివేక్ మధ్య కూడా వివాదం జరిగిం ది. అటవీశాఖకు సంబంధించి వివేక్ సమీక్ష నిర్వహించడంపై కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనకు సమాచారం లేకుండా.. తన శాఖపై ఎలా రివ్యూ చేస్తారని సురేఖ ప్రశ్నించడంతో పాటు సంబంధిత అధికారులపైన ఆగ్రహం వ్యక్తంచేశారు. దీం తో మంత్రి వివేక్ వెంటనే సారీ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తన జిల్లా పరిధిలో అంశాలపైనే సమీక్ష చేసినట్లు వివేక్ వివరణ ఇచ్చుకున్నారు.
వీటితో పాటు జూబ్లీహిల్స్ టికెట్ లొల్లి కూడా పార్టీని రచ్చకీడ్చిన విష యం తెలిసిందే. టికెట్ ఆశించిన మాజీ ఎంపీ అంజన్‌కుమార్ , పార్టీ నేతలపైన అసంతృప్తి వ్యక్తంచేయడంతో పాటు ‘గత ఎన్నికల్లో కామారెడ్డిలో పోటీ చేసినప్పుడు లోకల్, నా న్ లోకల్ ఎందుకు వర్తించలేదు.. నా విషయ ంలోనే వర్తిస్తుందా..?’ అని నిలదీశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి సీఎం రేవంత్‌రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే.