21-09-2025 12:32:01 AM
-డాక్టర్ గురు ఎన్ రెడ్డి దిశానిర్దేశం
-కాంటినెంటల్ హాస్పిటల్స్‌కు రెండు అవార్డులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): కాంటినెంటల్ హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు, చైర్మన్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి, హైదరాబాద్ తాజ్ డెక్కన్‌లో తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సహకారంతో శనివారం నిర్వహించిన 3వ ఏహెచ్‌పీఐ లీడర్షిప్ సమ్మిట్ 2025లో ప్రధానోపన్యాసం చేశారు. గ్లోబల్ ట్రెండ్స్ ఇన్ హెల్త్‌కేర్ లీడర్షిప్‌లో ఇండియా ఏమి నేర్చుకోవచ్చు? అనే అంశంపై ఆయన ప్రసంగం 500 మందికి పైగా వైద్యరంగ నాయకులు, వైద్యులు, నిపుణులను ఆకట్టుకుంది.
ఈ సమ్మిట్‌కు రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది, ఏహెచ్‌పీఐ అధ్యక్షుడు డాక్టర్ ఎం.ఐ. సహదుల్లా, తెలంగాణ ప్రభు త్వ సలహాదారు, ఏహెచ్‌పీఐ/ టీఎస్‌హెచ్‌ఏ కార్యదర్శి గోవింద్ హరి హాజరయ్యారు. అత్యాధునిక ఆవిష్కరణల ప్రోత్సాహకంగా, కాంటినెంటల్ హాస్పిటల్స్‌కు రెండు సర్వీస్ ఎక్సలెన్స్ అవార్డులు లభించాయి. ఇన్నోవేటివ్ హాస్పిటల్ గవర్నెన్స్ స్ట్రక్చర్, హోలిస్టిక్ స్టాఫ్ ఎంగేజ్మెంట్, రికగ్నిషన్లో ఎక్సలెన్స్ అవార్డులు దక్కాయి.
ఈ అవార్డులు కాంటినెంటల్ హాస్పిటల్స్ ప్రతి సిబ్బందిని రోగ సంరక్షణలో భాగస్వామిగా భావించే నిబద్ధతను ప్రతిబింబిస్తున్నాయి. రెండు రోజుల పాటు సాగిన సమ్మిట్ 2025 శనివారం విజయవంతంగా ముగిసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఆరోగ్యరంగ నాయకులు పాల్గొని, భారత ఆరోగ్యరంగ భవిష్యత్ రూపకల్పనపై ఆలోచనలు పంచుకున్నారు.