11-07-2025 12:00:17 AM
న్యూఢిల్లీ, జూలై 10: ఏఐతో ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉంద ని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ అంశంపై తాజాగా మైక్రో సాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే వందేండ్లయినా ప్రో గ్రామర్లను ఏఐ భర్తీ చేయలేదని పేర్కొన్నారు. కోడింగ్‌కు కూడా మా నవ మేధ అవసరమని అభిప్రాయపడ్డారు. ‘ప్రోగ్రామింగ్ రంగంలో ఏఐ మనకు అసిస్టెంట్‌గా వ్యవహరిస్తుంది. డీబగ్గింగ్ లాంటి బోరింగ్ అంశాల్లో సాయమందిస్తుంది.
ఏఐ అనేది పూర్తిగా ప్రత్యామ్నాయం కాదు. క్లిష్టమైన సమస్యను సృజనాత్మకంగా పరిష్కరిం చడం ప్రో గ్రామింగ్‌లో అత్యంత కీల కం. దాన్ని మెషిన్స్ చేయలేవు. ప్రో గామింగ్‌కు జడ్జిమెంట్, ఊహాత్మక ఆలోచనా ధో రణి, పరిస్థితులకు అ నుగుణంగా స ర్దుబాటు కావడం లాంటివి అవస రం.
ఈ లక్షణాలు ఏ ఐలో లేవు’ అ ని బిల్‌గేట్స్ పేర్కొన్నా రు. కోడింగ్ రాయడమంటే కేవ లం టైపింగ్ చే యడం కాదు.. చాలా లో తుగా ఆ లోచించాల్సి ఉంటుందని బి ల్‌గేట్స్ చెప్పారు. మానవ మేధస్సుకు ఉండే సృజనాత్మకతకు అల్గారిథమ్ సరిపోదని అభిప్రాయపడ్డారు.