11-07-2025 12:00:00 AM
రిక్టర్ స్కేల్‌పై 4.4 తీవ్రత నమోదు
న్యూఢిల్లీ, జూలై 10: దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో గురువారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై అది 4.4 తీవ్రతగా నమోదైంది. హర్యానాలోని ఝజ్జర్‌కు ఈ శాన్యంలో 3 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతున రోహతక్ వద్ద భూకంప కేంద్రం ఉన్నట్టు జాతీయ భూకంపకేంద్రం వెల్లడించింది. ఈ ప్రాంతం పశ్చిమ ఢిల్లీకి కేవలం 51 కిలోమీటర్ల దూ రంలోనే ఉంది.
ఢిల్లీ పాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోనూ బలమైన భూకంపం స ం భవించింది. దాదాపు 10 సెకన్లపాటు ప్రకంపనలు కొనసాగాయి. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురు గ్రా మ్, భివానీ, బహదూర్‌గఢ్ సహా అనేక నగరాల్లో భూకంపం సంభవించింది. ఝజ్జ ర్‌లో రెండు నిమిషాల వ్యవధిలో రెండు భూకంపాలు సంభవించాయి. ఇప్పటివరకు ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభ వించలేదని అధికారులు తెలిపారు.