11-07-2025 12:01:40 AM
న్యూఢిల్లీ, జూలై 10: రెండు శిక్షణ విమానాలు గాల్లోనే ఢీకొనగా.. ప్ర మాదంలో ఇద్దరు యువ పైలట్లు మృతిచెందారు. ఇందులో ఒకరు భారత సంతతికి చెందిన విద్యార్థిగా గుర్తించారు. కెనడాలోని మానిటోబాలో ఈ ప్రమాదం చోటుచేసు కుంది.
భారత సంతతి వ్యక్తిని కేరళకు చెందిన శ్రీహరి సుకేశ్‌గా గుర్తించినట్టు టొరంటోలోని భారత కాన్సు లేట్ వెల్లడించింది. కేరళకు చెందిన శ్రీహరి సుకేశ్ (21), కెనడాకు చెం దిన సవన్నా మే రాయ్స్ (20).. మా నిటోబాలోని హర్వ్స్ ఎయిర్ పైలట్ ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్నారు.
స్టెయిన్ బాచ్‌లో మంగ ళవారం ఉదయం ఇద్దరు పైలట్లు చిన్నపాటి విమానాల్లో టేకాఫ్, ల్యాం డింగ్‌లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ క్రమంలో చిన్న రన్‌వేపై ఇద్దరూ ఒకేసారి ల్యాండింగ్‌కు ప్రయత్నించగా ప్రమాదం.. దాదాపు 400 మీటర్ల ఎత్తులో రెండు విమానాలు ఢీకొన్నాయని ట్రైనింగ్ స్కూల్ ప్రెసిడెంట్ ఆడమ్ పెన్నెర్ వెల్లడించారు.