11-07-2025 12:40:19 PM
జడ్చర్ల : వేసవికాలంలో తాగునీరు ఇబ్బంది ఉంది అంటే భూగర్భ జలాలు(Ground water) అడుగంటి పోయాయి కొంత ఇబ్బంది ఉండొచ్చు అనుకుంటారు. జడ్చర్ల మండల పరిధిలోని పోలేపల్లి గ్రామంలో గత మూడు నెలల నుంచి తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం పోలేపల్లి గ్రామంలో(Polepally village) కాలి బిందెలతో తాగునీరు కల్పించాలని ఆ గ్రామ మహిళలు ఆందోళన(Women Protest) వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు అధికారులు నిరంతరం అందుబాటులో ఉన్నప్పటికీ పోలేపల్లి గ్రామంలో తాగునీటి ఇబ్బంది పరిష్కరించకపోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికైనా తాగునీటి సమస్యను పరిష్కరించాలని లేని యెడల మరింత ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మహిళలు హెచ్చరిస్తున్నారు. తాగు నీదే లేకుంటే ప్రజా సమస్యలను ఎలా పరిష్కరిస్తారని ప్రజాపాలన ప్రభుత్వం అంటే ఇదేనా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టీవీలో పేపర్లలో ప్రజాపాలన బాగుంది బాగుంది అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. పోలేపల్లి గ్రామంలో ఇప్పటికే రూ 1 కోటి 74 లక్షల అవినీతి జరిగిందని వెంటనే బాధ్యతపై చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నప్పటికీ గ్రామంలో కనీసం తాగునీరు కూడా కల్పించలేని దుస్థితి ఎందుకు వచ్చిందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిరోజు తాగునీటి కోసం ఉంటే ఏం పనులు చేసుకుని బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ సమస్యను పరిష్కరించాలని పోలేపల్లి గ్రామ మహిళలు కోరుతున్నారు.