calender_icon.png 11 July, 2025 | 6:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీటి వినియోగం, పంపకం మధ్య తేడా సీఎం తెలియట్లేదు

11-07-2025 11:49:24 AM

హైదరాబాద్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Thanneeru Harish Rao) జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(Justice PC Ghose Commission)ను శుక్రవారం కలిశారు. కాళేశ్వరానికి సంబంధించిన అదనపు సమాచారాన్ని కమిషన్ కు అందించారు. జస్టిస్ ఘోష్ ను కలిసిన అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ... కాళేశ్వరం కమిషన్(Kaleshwaram Commission)ను కలిసి తమ వద్ద ఉన్న అదనపు సమాచారం ఇచ్చామని చెప్పారు. అప్పటి కేబినెట్ నిర్ణయాలు కావాలని సీఎస్ కు లేఖ రాశానని హరీశ్ రావు తెలిపారు. మూడు సార్లు జరిగిన శాసనసభలోని అప్రూవల్ వివరాలను కమిషన్ కు ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆరు జరిగిన కేబినెట్ అప్రూవల్ వివరాలు అందించినట్లు చెప్పారు.

కాళేశ్వరం కమిషన్ కు ప్రభుత్వం పూర్తి సమాచారం ఇవ్వట్లేదని తమకు అనుమానాలు ఉన్నాయని హరీష్ రావు ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ తరుపున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతామని ఆయన వెల్లడించారు. నీటి వినియోగం, నీటి పంపకం మధ్య తేడా సీఎం రేవంత్ రెడ్డికి తెలియట్లేదని విమర్శించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో సీఎం అబద్ధాలు చెప్పారని సూచించారు. కేంద్రంతో పోరాడి సెక్షన్ 3ని సాధించిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కృష్ణా నీళ్లు 299 టీఎంసీల నీటి కేటాయింపు కాంగ్రెస్ పాపమేనని ఆయన తెలిపారు.