11-07-2025 12:32:41 PM
హైదరాబాద్: ప్రైవేట్ ఇంజినీరింగ్(Engineering Colleges) కాలేజీలకు తెలంగాణ హైకోర్టులో శుక్రవారం (Telangana High Court) చుక్కెదురైంది. ఫీజులు పెంచేలా రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని కాలేజీలు కోరాయి. ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాల విజ్ఞప్తిని హైకోర్టు శుక్రవారం తిరస్కరించింది. ఇంజినీరింగ్(Private engineering colleges) కళాశాలల ఫీజు పెంచాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గురునానక్, గోకరాజు రంగరాజు, మరో ఇంజినీరింగ్ కళాశాల కోర్టులో పిటిషన్ వేశాయి.
పాత ఫీజులతోనే కొనసాగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Govt) జీవో విడుదల చేసింది. ప్రభుత్వం జీవో విడుదల చేయడాన్ని కళాశాలల యాజమాన్యాలు సవాల్ చేశాయి. ఫీజులు పెంచితే విద్యార్థులపై భారం పడుతుందని టీఏఎఫ్ఆర్ సీ(Admission, Fee Regulatory Committee) న్యాయవాది తెలిపారు. ఫీజుల పెంపు కోసం ఇచ్చిన వినతులపై ఫీజుల నియంత్రణ కమిటీకి నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించారు. ఆరు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ప్రభుత్వం తీసుకునే తుది నిర్ణయంపైనే పెంపు ఉంటుందని హైకోర్టు తెలిపింది.