calender_icon.png 18 October, 2025 | 10:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీని కాపాడేది ప్రజలు, నాయకులే..!

18-10-2025 12:42:13 AM

ఏఐసీసీ  ప్రధాన పరిశీలకులు డాక్టర్ నరేష్ కుమార్

బెల్లంపల్లి,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీని కాపాడేది కార్యకర్తలు, ప్రజలేనని ఏఐసీసీ ప్రధాన పరిశీలకులు డాక్టర్ నరేష్ కుమార్ అన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆర్పి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే గడ్డం వినోద్ సమక్షంలో డిసిసి అధ్యక్ష పదవి కోసం కాంగ్రెస్ పార్టీ ఆశావాహుల నుండి దరఖాస్తులను స్వీకరించారు. ప్రధానంగా పోటీలో నిలిచిన  కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, బెల్లంపల్లి మాజీ జెడ్పిటిసి కారుకూరి రాoచందర్, బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ ఎం.సూరిబాబు, రాములు నాయక్ లతోపాటు నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిసిసి అధ్యక్ష పదవి కోసం దరఖాస్తులను సమర్పించారు.

ఈ సందర్భంగా ఏఐసీసీ సీనియర్ పరిశీలకులు నరేష్ కుమార్ మాట్లాడుతూ ప్రజల్లో నుండి వచ్చే ఆలోచనలను పరిగణన లోకి కాంగ్రెస్ డిసిసి అధ్యక్ష పదవికి అభ్యర్థిని నిర్ణయిస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీని ప్రగతి పథంలో నడిపించేందుకు డిసిసి అధ్యక్షున్ని నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా ఎన్నుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే గడ్డం వినోద్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో సీనియార్టీని, చేపట్టిన పదవులను దరఖాస్తుల్లో ఆశావహులు వెల్లడించాలన్నారు.

పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ముచ్చర్ల మల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు దండే విఠల్, పురాణం సతీష్, కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఏ. జ్యోతి, అనిల్ కుమార్, శ్రీనివాస్ తో పాటు, బెల్లంపల్లి మాజీ ఎంపీపీ తొంగల మల్లేష్, మాజీ ఎంపీటీసీ ఎం.మహేందర్, సేవాదళ్ నాయకులు బండి రాము, బండి ప్రభాకర్, మహిళా నాయకురాళ్ళు చొప్పదండి దుర్గ భవాని, రొడ్డ శారద, పోరండ్ల సత్యవతి తో పాటు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.