calender_icon.png 18 October, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హిందూవాహిని ఆధ్వర్యలో శివాజీ సంకల్ప సభా

18-10-2025 12:44:38 AM

సిద్దిపేట రూరల్: సిద్దిపేట పట్టణంలో శివానుభవ మండపంలో శుక్రవారం హిందూ వాహిని ఆధ్వర్యంలో శివాజీ సంకల్ప సభ ఘనంగా నిర్వహించారూ. ఈ సభకు “మన సంస్కృతి పరిరక్షణ దేవాలయాల పరిరక్షణ” అనే ప్రధాన అంశంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సభకు ముఖ్య అతిథిగా శ్రీ నేతి కైలాసం గారు హాజరై ప్రసంగించారు. హిందూ ధర్మ పరిరక్షణ, దేవాలయాల గౌరవం కాపాడడం ప్రతి హిందువు బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.

భారతదేశం యొక్క గొప్ప చరిత్ర, సంస్కృతి, ఆధ్యాత్మిక సంపదను గుర్తు చేస్తూ, యువతలో దేశభక్తి, ధార్మిక చైతన్యం పెంపొందించాలన్నారు. ప్రధాన వక్తగా శ్రీ ముడుపు యాదవరెడ్డి గారు (తెలంగాణ ప్రాంత హిందూ వాహిని సంఘటన కార్యదర్శి) పాల్గొని మాట్లాడుతూ  "శివాజీ మహారాజు ఆత్మవిశ్వాసం, ధర్మ రక్షణలో చూపిన ధైర్యం ఈ తరం యువతకు ఆదర్శంగా నిలవాలి. హిందూ సమాజం ఏకమై ఉంటేనే దేశం బలంగా నిలుస్తుంది" అని చెప్పారు.