calender_icon.png 26 October, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్ జి ఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఎయిర్ రైఫిల్ షూటింగ్ పోటీలు ప్రారంభం

25-10-2025 05:49:29 PM

కరీంనగర్ (విజయక్రాంతి): నగరంలోని భగత్ నగర్ స్వదేష్ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీలో శనివారం 69వ అండర్-19 ఉమ్మడి జిల్లా స్థాయి ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఎంపిక పోటీలను నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, విఎన్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు, అల్ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ డా.వి.నరేందర్ రెడ్డి పోటీలను ప్రారంభించి మాట్లాడుతూ విద్యార్థులకు విద్యారంగంతో పాటు క్రీడారంగంలో నైపుణ్యం పొందే విధంగా ప్రోత్సాహం అందించాలని, క్రీడారంగంలో నైపుణ్యం పొందడానికి కావలసిన వనరులను సమకూర్చి వాటిలో నిష్ణాతులుగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్వదేశ్ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ డైరెక్టర్ అరుణ్ తేజ, పిఇటిలు, పిడిలు, క్రీడాకారులు, తదితరులు పాల్గొన్నారు.