calender_icon.png 26 October, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా కెమిస్ట్రీ వారోత్సవాలు

25-10-2025 05:51:13 PM

కరీంనగర్ (విజయక్రాంతి): నగరంలోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ లో కెమిస్ట్రీ వారోత్సవాలను శనివారం ఘనంగా నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతి మడికొండ వెంకటేష్, ద్వితీయ బహుమతి పెంట్కర్ రామ్ చరణ్, తృతీయ బహుమతి గుంజి వైష్ణవిలకు ఎస్. ఆర్. ఆర్. డిగ్రీ కాలేజ్ రిటైర్డ్ ప్రిన్సిపల్ కేప్టెన్ బుర్ర మధుసూదన్ రెడ్డి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైన్స్ మన నిత్య జీవితముతో ముడిపడి ఉందని, జీవితంలో రాణించాలంటే ప్రశ్నించడం నేర్చుకోవాలని అన్నారు. మన ఉజ్వల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుందని, ఇష్టపడి చదివితే సులభంగా విజ్ఞానాన్ని పొంది, ఆశించిన ఫలితాలను సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంజనీర్ కోల అన్నారెడ్డి, మేచినేని దేవేందర్ రావు, చిపిరిశెట్టి సత్యనారాయణ, ప్రధానాచార్యులు సముద్రాల రాజమౌళి, తదితరులు  పాల్గొన్నారు.