calender_icon.png 25 August, 2025 | 5:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోహన్ బాబుకు హైకోర్టులో ఊరట

11-12-2024 04:16:35 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): సినీ నటుడు మోహన్ బాబుకు పోసులు జారీ చేసిన నోటీసులపై బుధవారం హైకోర్టు విచారించింది. పోలీసుల నోటీసులపై స్టే కోరుతూ మోహన్ బాబు లంచ్ మోషన్ పిటిషన్ దాఖాలు చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు పోలీసుల ముందు హాజరయ్యేందుకు  మినహాయింపు ఇచ్చిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది. మోహన్ బాబుపై నమోదైన కేసులను ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు వివరించారు. పరస్పర ఫిర్యాదులపై కేసులు నమోదయ్యాయని, జర్నలిస్టుపై దాడి కేసులో మరో క్రిమినల్ కేసు నమోదైందని ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు.

అలాగే నోటీసులు అందుకున్న మంచు మనోజ్ కూడా ఇవాళ పోలీసు విచారణకు వచ్చారని జీపీ తెలిపారు. మోహన్ బాబు ఇంటివద్ద పోలీసు గస్తీ ఏర్పాటు అనుమతించాలని హైకోర్టును న్యాయవాది వాదించారు. దీంతో జీపీ స్పందిస్తూ మోహన్ బాబు ఇంటి వద్ద నిరంతరం పోలీస్ గస్తీ ఏర్పటు చేయడం సాధ్యం కాదని, రెండు గంటలకు ఒకసారి పోలీసులు చూసి వస్తున్నారని కోర్టు తెలిపారు. రెండు గంటలకు ఒకసారి మోహన్ బాబు ఇంటికి వెళ్లాలని, తదుపరి విచారణ వరకు పరిస్థితిని పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించిన హైకోర్టు తదుపరి విచారణను ఈనెల 24కు వాయిదా వేసింది.