calender_icon.png 20 September, 2025 | 3:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిఎం కార్యాలయం ఎదుట ధర్నా

20-09-2025 12:39:05 AM

మందమర్రి,(విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం సింగరేణికి 2024-25 ఆర్థిక సంవత్సరంలో వచ్చిన నికర లాభాలను ప్రకటించి, కార్మికులకు 35 శాతం లాభాల వాటా చెల్లించాలని, కార్మికుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం  సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) కేంద్ర కార్యదర్శి ఎండి అక్బర్ ఆలీ, బ్రాంచ్ నాయకులు శైలేంద్ర సత్యనారాయణలు అన్నారు. యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా చలో జిఎం కార్యాలయం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఏరియా జిఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, అనంతరం సింగరేణి అధికారులకు వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ... కార్మికులకు లాభాల వాటా 35 % చెల్లించాలని, కార్పొరేట్ స్థాయిలో జరిగిన స్టృక్చరల్ సమావేశాలలో ప్రధాన డిమాండ్లైన సొంతింటి కల, పెర్క్స్ పై ఐటి యాజమాన్య తిరిగి చెల్లించడం తదితర డిమాండ్లపై ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సిన రూ.43 వేల కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. నూతన బొగ్గు గనులను తెప్పించి, సింగరేణి అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం దృష్టి పెట్టాలన్నారు. స్ట్రక్చరల్ సమావేశాల్లో యాజమాన్యం ఒప్పుకున్న సమస్యలన్నింటిపై వెంటనే ఉత్తర్వులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో అన్ని సంఘాలను కలుపుకొని, పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని స్పష్టం చేశారు.