20-09-2025 12:36:24 AM
సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి
వలిగొండ, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి): వలిగొండ నుండి భువనగిరి వరకు పూర్తిగా గుంతలమయమై అధ్వానంగా మారిన బీటీ రోడ్డు మరమ్మత్తుల విషయంలో అధికారుల నిర్లక్ష్యం నశించాలని రోడ్డు మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు. శుక్రవారం ఏదుల్లగూడెం స్టేజి వద్ద సిపిఎం ఆధ్వర్యంలో రోడ్డు మరమ్మత్తులపై డిమాండ్ చేస్తూ రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గత ఆగస్టు నెల 14వ తేదీన అక్కంపల్లి మరియు మాందాపురం గ్రామాల్లో ఏర్పడిన గుంతల్ని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశాలు ఇచ్చిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఎందుకో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రోడ్డు అద్వానంగా మారడం పెద్ద ఎత్తున గుంతలు పడడం వల్ల అనేకమంది ద్విచక్ర వాహనదారులతోపాటు ఆటో లాంటి చిన్న వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయని దీంతో ప్రజలకు గాయాలు కావడం జరుగుతుందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు దుబ్బ లింగం, భూమి మాధవి, బూడిద మనమ్మ, శాఖ కార్యదర్శి పలుసం లింగం, నాయకులు బత్తుల నరసింహ, భూమి బాల శంకర్, బొడ్డు శంకర్, లలిత, అంజమ్మ, లత, పూలమ్మ, పార్వతమ్మ పాల్గొన్నారు.