02-12-2024 01:43:40 PM
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 వేలంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను తిరిగి తీసుకురావడంలో కోల్‌కతా నైట్ రైడర్స్ విఫలమవడం ఫ్రాంచైజీ బాస్‌లను ఆలోచించేలా చేసింది. ఆర్ సీబీ, కేకేఆర్ మధ్య జరిగిన బిడ్-వార్ మెగా వేలంలో ఫ్రాంచైజీ 23.5 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసిన వెంకటేష్ అయ్యర్ పేరు కెప్టెన్ గా తెరపైకి వచ్చింది. అయితే 2024 ఛాంపియన్‌లు మరొక ఆటగాడిని దృష్టిలో ఉంచుకున్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్ 2025 సీజన్‌లో కేకేఆర్ జట్టును నడిపించే నంబర్ 1 అభ్యర్థి అజింక్యా రహానే. రహానేను కేకేఆర్ 1.5 కోట్ల బేస్ ప్రైస్‌కు వేలంలో కొనుగోలు చేసింది. కోల్‌కతా నైట్ రైడర్స్ కొత్త కెప్టెన్ గా అజింక్య రహానేకు బాధ్యతలు అప్పగించడానికి కోల్ కతా సిద్ధమవుతున్నట్లు వార్తలొస్తున్నాయి. కోల్‌కతా నైట్ రైడర్స్ తమ టైటిల్ విన్నింగ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను 2025 సీజన్‌కు ముందు వేలంలోకి విడుదల చేసింది. ఇప్పుడు ఐపీఎల్ 2025 కేకేఆర్ కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారు? అనే అంశం కీలకంగా మారింది.