22-12-2025 12:00:00 AM
ఆసిఫాబాద్, డిసెంబర్ 21(విజయ క్రాంతి): ఆసిఫాబాద్ కవుల సంఘం 14వ వార్షికోత్సవం, 100వ నెలపొడుపు సాహిత్య కదంబం (అకసం) వేడుకలు ఆదివారం జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మంచిర్యాలకు చెందిన ప్రముఖ కథారచయిత్రి, కవయిత్రి సుబ్బాయమ్మకు అకసం పురస్కారం, నగదు కానుక అందజేసి శాలువాతో సన్మానించి ఆత్మీయ సన్మాన పత్రం అందించారు.
అకసం గౌరవ సలహాదారు అవధాని మాడుగుల నారాయణమూర్తి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి నల్లగొండ రమేశ్ అధ్యక్షత వహించారు. గౌరవాధ్యక్షులు గుర్రాల వెంకటేశ్వర్లు స్వాగత వచనాలు పలుకగా, ప్రధాన కార్యదర్శి శ్రీరాం సత్యనారాయణ నివేదిక సమర్పించారు. ముఖ్య అతిథిగా ప్రముఖ న్యాయవాది ముక్తాసురేశ్ పాల్గొనగా, విశిష్ట అతిథులుగా కరీంనగర్ జిల్లా కవుల సంఘం అధ్యక్షులు, తెలంగాణ రచయితల సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కొత్త అనిల్, ప్రముఖులు గుర్రాల మాధవ్ హాజరయ్యారు.
ఆత్మీయ అతిథులుగా విశ్రాంత ప్రధానోపాధ్యాయులు మరియాల ఉదయభాబు, వైశ్య సంగం ప్రముఖులు చిలివేరు వెంకన్న, నవజ్యోతి సాంస్కృతిక సంస్థ అధ్యక్షులు, అకసం గౌరవ సలహాదారు ధర్మపురి వెంకటేశ్వర్లు వేదికను పంచుకున్నారు. కవులు ఢిల్లీ విజయకుమార్, కిల్లీ వెంకట్రావ్, ఇందారం మధూకరశర్మ, రాధాకృష్ణ చారి, మురళి, పెంటయ్య, అల్లం ప్రశాంత్, సాయిని రాజశేఖర్ పాల్గొనగా, కవయిత్రులు తాటిపల్లి జ్యోతి, సాయిని శ్రీదేవి, కాచం సరిత, అమ్టే శ్రీమతి దేవరాజు రేవతి, త్రివేణి, ఏముల అంజలి, స్వప్న తదితరులు తమ కవితలను వినిపించారు. సాహిత్యాన్ని ప్రోత్సహించిన సాహితీ ప్రియులను సన్మానించి మెమెంటోలు అందజేశారు.