calender_icon.png 22 December, 2025 | 8:12 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీ పేరు తొలగింపుపై కాంగ్రెస్ ధర్నా

22-12-2025 12:00:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్,డిసెంబర్21 (విజయకాంతి): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును కేంద్ర బీజేపీ ప్రభుత్వం తొలగించడాన్ని నిరసిస్తూ ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీ ధర్నా నిర్వహించింది.ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణ ప్రధాన వీధుల గుండా ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ గాంధీ కుటుంబం పేరు వినగానే బీజేపీ నేతల గుండెల్లో భయం మొద లవుతుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గాడ్సే ను పూజించే మనస్తత్వం కలిగినవారే ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరు తొలగించారని విమర్శించారు.

గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం ప్రధాని మోదీకి, అమిత్ షాకు లేదని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని మార్చే కుట్రలకు బీజేపీ పాల్పడుతోందని, మనుస్మృతిని అమలు చేయా లనే ప్రమాదకర ఆలోచనలు చేస్తోందని ఆరోపించారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి తిరిగి గాంధీ పేరు పెట్టేవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో కేంద్రం లో కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, రాహుల్ గాంధీ ప్రధాని కావడం అనివార్యమని ధీమా వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వప్రసాదరావు, జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్, మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్, ఆసిఫాబాద్ మండల అధ్యక్షుడు చర ణ్, జైనూర్ మండల అధ్యక్షుడు ముఖిద్, కెరమెరి మండల అధ్యక్షుడు ఆత్రం కుసుమ్ రావు, తీర్యాని, వాంకిడి మండల అధ్యక్షులు సాగర్, నారాయణ, సీనియర్ నాయకులు పెందూర్ సుధాకర్, సిడాం తిరుపతి, ఇరుకుల మంగ, వందన, ఇందిరాబాయి, జక్కన్న, సత్తన్న, రాపర్తి మురళి తదితరులు పాల్గొన్నారు.