10-10-2025 01:08:08 AM
బాదేపల్లి ప్రభుత్వ బాలుర పాఠశాల లో చోటు చేసుకున్న వైనం
జడ్చర్ల,అక్టోబర్ 9 : పట్టణంలో సిగ్నల్ గడ్డ దగ్గర ఉన్న ప్రభుత్వ బాలుర పాఠశాలలో గురువారం మధ్యాహ్నం అక్షయ పాత్ర ఏజెన్సీ భోజనంలో విద్యార్థులు అన్నం తినేటప్పుడు అ న్నంలో తాడిచెర్రి రావడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. విద్యార్థుల ను సమాచారం అడిగి తెలుసుకున్న డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ ప్రశాంత్ అక్షయ పాత్ర భోజనం వస్తున్నప్పటి నుం డి విద్యార్థులు చాలామందికి ఆరోగ్యం బాగా లే కుండా పోతుందని విద్యార్థులు చెబుతున్నరన్నారు.
ఏదో ఒక రోజు మంచి భోజనం ఉంటుంది తప్ప ఎక్కువసార్లు మాత్రం పురుగులు ఇలాంటి పెద్ద పెద్ద తాడి జెర్రీ లు వస్తుంటాయని అన్నారు, తాడి జెర్రీ వచ్చినట్టు విద్యార్థులు ఎవరికైనా చెబితే వాళ్లపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని అక్కడున్న ఉపాధ్యాయులు విద్యార్థుల ను బెదిరిస్తున్నారని విద్యార్థులు ఆవేదనా వ్యక్తం చేశారు.
విద్యార్థులు డివైఎఫ్‌ఐ సంఘం కి చెప్పడంతో డి వై ఫ్ ఐ కన్వీనర్ ప్రశాంత్ అక్షయ పాత్ర భోజనం బంద్ చేసి స్కూళ్లలో వండించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అక్షయపాత్ర పై చర్యలు తీసుకోకపోతే విద్యార్థులను రోడ్లపైకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ ప్రశాంత్‌అన్నారు.