calender_icon.png 11 October, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బైక్ ఢీకొన్న ఘటనలో టీచర్‌కు గాయాలు..

10-10-2025 01:09:29 AM

అలంపూర్, అక్టోబర్ 09:కారును రోడ్డు ప్రక్కకు ఆపి ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్న వ్యక్తిని ఓ బైకు వేగంగా వచ్చి ఢీకొట్టన ఘటన ఉండవల్లి పిఎస్ పరిధిలో చోటుచేసుకుంది.ఎస్త్స్ర శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఉండవల్లి మండల కేంద్రానికి చెందిన వేణుగోపాల్ జో గులాంబ హాల్టు సమీపంలో తన కారును రో డ్డు పక్కన నిలిపి ఫ్రెండ్స్ తో మాట్లాడుతున్న క్రమంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అతివేగంగా వచ్చి ఢీకొట్టాడు.

ఈ ప్రమాదంలో వేణుగోపాల్ తీవ్రంగా గాయపడ్డారు.చికిత్స నిమిత్తం గాయపడిన వ్యక్తిని ఫ్రెండ్స్ కర్నూల్ హాస్పిటల్ కి తరలించారు.భార్య సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్త్స్ర పేర్కొన్నారు. అయితే గాయపడిన వ్యక్తి వేణుగోపాల్ మానవపాడు మండల కేంద్రంలో జడ్పీ పాఠశాలలో టీచర్ విధులు నిర్వహిస్తున్నాడు.

ఎమ్మెల్యే పరామర్శ 

కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వేణుగోపాల్ ను ఎమ్మెల్యే విజయుడు గురువారం పరామర్శించారు.మెరుగైన వైద్యం అందించాలని రైతులకు సూచించారు.