calender_icon.png 6 September, 2025 | 8:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థినికి ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు

06-09-2025 05:37:49 PM

కొత్తపల్లి, సెప్టెంబర్06(విజయక్రాంతి): అల్ఫోర్స్ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థినికి ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు లభించింది. ఇటీవల హైదరాబాద్ లో భారత్ ఆడ్స్ అకాడమీ వారి ఆధ్వర్యంలో సుమారు 4500 మంది విద్యార్థుల పైగా వారితో నిర్వహించినటువంటి కూచిపూడి నృత్య ప్రదర్శనలో పాఠశాల చెందినటువంటి గజబింకార్  నిత్య, ఆరో తరగతి బిద్యార్థిని కూచిపూడి నృత్య ప్రదర్శనలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కాకుండా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.

ఈ సందర్బంగా స్థానిక కొత్తపల్లిలోని ఆల్ఫోర్స్ ఇ- టెక్నో పాఠశాలలో విద్యార్థిని అభినందన సభ ఏర్పాటు చెశారు విద్యార్థులకు విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల పట్ల అవగాహన కల్పించడమే కాకుఃడా వాటిలో పాల్గొనేదెందుకు తగినటువంటి ప్రోత్సాహాన్ని అందించాలని అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత డా.వి. నరేందర్ రెడ్డిఅన్నారు.

కళల పట్ల కూడా అవగాహన పెంపొందించి వివిధ కళా ప్రదర్శనలలో పాల్గొనేందుకు ఆసక్తిని పెంపొందించడమే కాకుండా వాటిలో పాల్గొని విజేతలుగా నిలవాలని వారు కోరారు. కళల ద్వారా విద్యార్థులకు రోజువారి ఎదురవుతున్నటువంటి ఒత్తిడి నుండి ఉపశమనం  కల్పించవచ్చని మరియు కళలు విద్యార్థులకు ఎంతో సంతోషాన్ని చేకూరుస్తాయని  చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని గుర్తు చేస్తూ ప్రతి విద్యార్థి సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనాలని సూచించారు