06-09-2025 06:51:08 PM
చండూరు,(విజయక్రాంతి): చండూరు మున్సిపాలిటీకి చెందిన జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా గురిజ మహేష్ నల్లగొండ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతుల మీదుగా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. గురిజ మహేష్ ఒక ఉపాధ్యాయుడిగా కాకుండా సామాజిక సేవా కార్యక్రమంలో ఆయన చురుగ్గా పాల్గొనడం, ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, పాఠశాలకు రాకపోతే ఆయన ప్రత్యేకంగా ఆయన బైక్ పైన విద్యార్థులను పాఠశాలకు తీసుకవస్తారు. ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదని ఆయన ఆర్థిక సాయం అందించడం, వారికి అవసరమైన మౌలిక వసతులు కల్పించి విద్యార్థులను ప్రత్యేక శ్రద్ధ పెట్టడం పై, ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని విద్యాశాఖ అధికారులు గుర్తించి అవార్డును అందజేశారు. ఈ అవార్డును దక్కించుకోవడంతో గ్రామ ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.